నాకు నచ్చిన కొన్ని తెలుగు పాటలు - ఆ పాత మధురాలు
చిత్రం : శివరంజని (1978)
సంగీతం : రమేష్ నాయుడు
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల
నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జాబిలి నీవు, కలుసుకున్న ప్రతిరేయీ
కార్తీక పున్నమి రేయి ,నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతిరేయీ, కార్తీక పున్నమి రేయి ,
కార్తీక పున్నమి రేయి ,నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతిరేయీ, కార్తీక పున్నమి రేయి ,
నవమి నాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలి నీవు
దశమి నాటి జాబిలి నీవు
నీ వయసే వసంత రుతువై, నీ మనసే జీవన మధువై, నీ వయసే వసంత రుతువై
నీ మనసే జీవన మధువై, నీ పెదవే నా పల్లవి గా, నీ నగవే సిగ మల్లిక గా
చెరిసగమై యే సగమేదో, మరచిన మన తొలి కలయికలో
నీ మనసే జీవన మధువై, నీ పెదవే నా పల్లవి గా, నీ నగవే సిగ మల్లిక గా
చెరిసగమై యే సగమేదో, మరచిన మన తొలి కలయికలో
నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతిరేయీ , కార్తీక పున్నమి రేయి,
కలుసుకున్న ప్రతిరేయీ , కార్తీక పున్నమి రేయి,
నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జాబిలి నీవు
నీ వొడిలో వలపును నేనై, నీ గుడిలో వెలుగే నేనై, నీ వొడిలో వలపును నేనై
నీ గుడిలో వెలుగే నేనై , అందాలే నీ హారతి గా, అందించే నా పార్వతి గా
మనమొకటై రసజగమేలే, సరస మధుర సంగమ గీతికలో
నీ గుడిలో వెలుగే నేనై , అందాలే నీ హారతి గా, అందించే నా పార్వతి గా
మనమొకటై రసజగమేలే, సరస మధుర సంగమ గీతికలో
నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతిరేయీ, కార్తీక పున్నమి రేయి
నవమి నాటి వెన్నెల నేను
కలుసుకున్న ప్రతిరేయీ, కార్తీక పున్నమి రేయి
నవమి నాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలి నీవు
ఆకాశ దేశాన ఆషాఢ మాసాన – మేఘసందేశం
ఆకాశ దేశాన
ఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా
మెరిసేటి ఓ మేఘమా, విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికి
మేఘసందేశం మేఘసందేశంవానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై, వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై ఈ యేడారి దారులలో ఎడద నేను పరిచానని ,కడిమివోలే నిలిచానని ఉరమని తరమని ఊసులతో ఉలిపిరి చినుకుల బాసలతో విన్నవించు నా చెలికి విన్న వేదనా నా విరహ వేదనా
ఆకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా
రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై ,రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని ,శిధిల జీవినైనానని తొలకరి మెరుపుల లేఖలతో రుధిర భాష్పజల దారలతో ఆ..ఆ..ఆ..ఆ విన్నవించు నా చెలికి మనోవేదనా నా మరణయాతనా
ఆకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా విరహమో దాహమో విడలేని మోహమో వినిపించు నా చెలికి మేఘసందేశం మేఘసందేశం
సినిమా: మేఘసందేశం (1984)
రచయిత: వేటూరి ; సంగీతం: రమేష్ నాయుడు
గానం: ఏసుదాసు
జగమంత కుటుంబం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది (2)సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నాదేలె
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
కదిలే కవితనై, భార్యనై, భర్తనై (2)
మల్లెల దారులలో, మంచు ఏడారిలో
మల్లెల దారిలో మంచు ఏడారిలో
పన్నీటి జయగీతాల, కన్నీటి జలపాతాల
నాతో నేను సంగమిస్తూ, నాతో నేనే రమిస్తూ
ఓంటరినై అనవతరం, కంటున్నాను నిరంతరం
కలల్ని, కథల్ని, మాటల్ని, పాటల్ని, రంగుల్ని, రంగవల్లుల్ని
కావ్య కన్యల్ని, ఆడ పిల్లల్ని
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
మింటికి కంటిని నేనై, కంటను మంటను నేనై (2)
మంటల మాటున వెన్నెల నేనై, వెన్నెల పూతల మంటను నేనై
రవినై, శశినై, దివమై, నిశినై,
నాతో నేను సహగమిస్తూ, నాతో నేనే రమిస్తూ
ఒంటరినై ప్రతి నిమిషం, కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల, హరిణాల్ని హరిణాల
చరణాల్ని చరణాల, చలనాన కనరాని గమ్యాల కాలాన్ని, ఇంద్రజాలాన్ని
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం
గాలివాటు గమనానికి కాలిబాట దేనికి
గొర్రెదాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్టం
కృష్ణగీత ఆపిందా నిత్య కురుక్షేత్రం
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
పాతరాతి గుహలు పాలరాతి గృహాలైనా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా
వేట అదే వేటు అదే నాటి కథే అంతా
నట్టడవులు నడి వీధికి నడిచొస్తే వింత
బలవంతులే బ్రతకాలని సూక్తి మరవకుండా
శతాబ్దాలు చదవలేద ఈ అరణ్యకాండ
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి