"ఆర్థిక శాస్త్రం"



చాలా మంది అనుకుంటారు "ఆర్థిక శాస్త్రం అంటే దేశంలో ఎన్ని చెరువులు ఉన్నాయి, దేశ GDP ఎంత"  లాంటి లెక్కలు వెయ్యడం అని. అది కరెక్త్ కాదు.

మీరు ఒక షాప్‌కి వెళ్ళారనుకోండి. అక్కడ మీరు ఒక వస్తువు కొనే ముందు ఆ వస్తువు మీరు పెట్టే ఖర్చుకి సరిపోయేంత సంతృప్తి ఇస్తుందా, లేదా అని ఆలోచించి కొంటారు. మీకు ఆదాయం తక్కువగా ఉన్నప్పుడు చవక రకం వస్తువులు కొంటారు, ఆదాయం ఎక్కువగా ఉన్నప్పుడు ఖరీదైన వస్తువులు కొంతారు. మీకు ఆదాయం తక్కువగా ఉన్నప్పుడు తక్కువ సంఖ్యలో వస్తువులు కొంటారు, ఆదాయం ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ సంఖ్యలో వస్తువులు కొంటారు. అలాగే ధరలు పెరిగినపుడు తక్కువ సంఖ్యలో వస్తువులు కొంటారు, ధరలు తగ్గినప్పుడు ఎక్కువ సంఖ్యలో వస్తువులు కొంటారు. మీ ఇంటికి సంబంధించినంత వరకు మీరే ఒక ఆర్థికవేత్త. సమాజం విషయానికి వస్తే ఆర్థికవేత్త అనేక విషయాలని పరిశీలించాలి, విశ్లేషించాలి.

ఆర్థిక శాస్త్రానికి నిర్వచనం ఏమిటి?

ఆదమ్ స్మిత్ నిర్వచనంలో ఆర్థిక శాస్త్రం అంటే సంపద సృష్టించడం, వృద్ధి చెయ్యడం. దేశాన్ని ఆర్థికంగా ముందుకి తీసుకెళ్ళాలంటే ఆ దేశం యొక్క సంపదని వృద్ధి చెయ్యాలి. Human beings are guided by self-interest and economic man is created by wealth definition అనేవాడు ఆదమ్ స్మిత్. ఆదమ్ స్మిత్ సంపదనే ఎంఫసైజ్ చేసాడు కానీ మనిషిని పట్టించుకోలేదని విమర్శలు వచ్చాయి. ఆర్థిక శాస్త్రాన్ని ఈ విమర్శల నుంచి రక్షించడానికి ఆల్‌ఫ్రెద్ మార్షల్ అనే శాస్త్రవేత్త సంక్షేమ నిర్వచనాన్ని తీసుకువచ్చాడు. మార్షల్ నిర్వచనం ప్రకారం ఆర్థిక శాస్త్రం అంటే మనిషి యొక్క వస్తుగత సంక్షేమం. ఆదమ్ స్మిత్ సంపదకి పెద్ద పీట వేసాడు కానీ మనం సంక్షేమానికి పెద్ద పీట వెయ్యాలి అని ఆల్‌ఫ్రెద్ మార్షల్ అనేవాడు.

మార్షల్ సంవాదం(theses)పై కూడా విమర్శలు ఉన్నాయి. లయోనెల్ రాబిన్స్ వాదన ప్రకారం సంక్షేమం అనేది విషయగతమైనది. ఒకరికి నచ్చిన వస్తువు ఇంకొకరికి నచ్చకపోవచ్చు అని రాబిన్స్ అనేవాడు. ఆర్థిక శాస్త్రం అంటే పరిమిత వనరుల నిర్వహణ అని ఆయన అనేవాడు. వనరులు పరిమితమైనవి కానీ మనిషి యొక్క కోరికలు అంతులేనివి. వనరులు అంతులేకుండా ఉండి మనకి కావలసినవన్నీ అందితే ఆర్థిక శాస్త్రం యొక్క అవసరం ఉండదు అని రాబిన్స్ అనేవాడు. ఆర్థిక శాస్త్రవేత్తలలో ఎక్కువ మంది రాబిన్స్ సంవాదాన్నే సమర్థిస్తారు.


అందమైన సముద్ర తీరాన ఇల్లు కట్టుకోవాలని అందరికీ ఉంటుంది కానీ ప్రపంచ జనాభా అంతటినీ సముద్ర తీరానికి తరలించడం సాధ్యం కాదు. సముద్ర తీరాన ఇల్లు కొనుక్కునేవాళ్ళ సంఖ్య పెరిగితే అక్కడ ఇళ్ళు కట్టి అమ్మే స్థిరాస్తి వ్యాపారులు ఇళ్ళ ధరలు పెంచేస్తారు. ఏ వ్యాపారులైనా తమ సొంత ప్రయోజనం కోసం వ్యాపారంచేస్తారు కనుక demand పెరిగితే ధర పెరుగుతుంది. వనరులు క్షీణించినప్పుడు వాటి demand మరింత పెరిగి ధర పెరుగుతుంది. సముద్ర తీరాన ఇళ్ళ సంఖ్య పెరిగి భూమి కొరత ఏర్పడినా అక్కడి భూమి ధర మరింత పెరిగి ఇల్లు కట్టుకోవడానికి మరింత వ్యయమవుతుంది.
 


"దేశంలో ఎన్ని చెరువులు ఉన్నాయి, దేశ GDP ఎంత"  లాంటి లెక్కలు వెయ్యడం statistics కిందకి వస్తుంది. అదేమీ ఆర్థిక శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి సరిపోదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

భారతదేశము నా మాతృభూమి...." ప్రతిజ్ఞ "

శ్రీమద్భగవద్గీత

జీవితం