నాకు నచ్చిన కొన్ని పాటలు వాటి విశ్లేషణలు
ఈ పాటలోని పాఠాలని ఒక సారి పరికిద్దాం:
Take Responsibility
నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా
నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా
ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా
ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా
చాలా సమస్యల్లో క్లిష్టత నిర్ణయం
తీసుకోవడంలోనే ఉంటుంది. ఊరికే
వదిలిస్తే సమస్యలు వాటంతట అవే తీరి పోతే
బాగుండేది. కానీ చాలా సమస్యలు ఇలా
దారికి రావు. కాబట్టి మనకున్న భయాలని, ఆందోళనలని పక్కన
పెట్టి సమస్యని ఎదురుకోక తప్పదు. పక్కవాళ్ళ సలహాలూ సూచనలూ తీసుకోవచ్చు కానీ
మనకేం కావాలో మనకి తప్ప ఎవరికీ తెలియదు. అందుకే “తప్పించుకు పారిపోకు, ఆగిపోకు, నీ సమస్యని నువ్వే సాధించాలి”
అని కర్తవ్య గీతను మరో శ్రీ కృస్ణుడై బోధిస్తున్నారు సిరివెన్నెల.
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక ఉంటుందా
అమ్మైనా సరే సాధారణంగా తొమ్మిది నెలలు
మోస్తుంది, మహా అయితే పది నెలలు.
అంతే. తర్వాత నువ్వు అమ్మ నుండి విడిపడాల్సిందే.
నీకు నువ్వుగా ఎదగాల్సిందే. అలాగే పూలకొమ్మ పూలని తనతోనే ఉంచుకోదు. గుడికో, జడకో పంపించి నీ పరిమళాన్ని నువ్వే పంచుకో,
నీ పరమార్థాన్ని నువ్వే చేరుకో అని చెప్తుంది. సినిమా పరంగా చెప్పాలంటే యువ జంటకి – “మీరు చిన్న పిల్లలు కారు..ఎదిగిన వాళ్ళూ,
తెలిసిన వాళ్ళు. మీరే తేల్చుకోండి” అని
హితబోధ చేస్తున్నరు సిరివెన్నెల.
Life is difficult
బతుకుంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా
జీవితం పూల బాట కాదు. ఇది తెలిసిందే
అయినా, ప్రేమ మత్తులో పడిన పడుచు జంటకి గుర్తు
చెయ్యాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ మత్తులో తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం
ఎక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు తీసుకునే నిర్ణయం వాళ్ళ ముందు జీవితాన్ని
నిర్ణయిస్తుంది. అందుకే ఆచితూచి అడుగు వెయ్యమని బోధన.
Real intelligence is knowing how to use
intelligence
అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా?
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా?
గతముందని గమనించని నడిరేయికి రేపుందా?
గతి తోచని గమనానికి గమ్యం అంటు ఉందా..?
తెలివీ,
తర్కం మనిషికున్న గొప్ప వరాలు. ఇవి Tools లాటివి.
వాడాల్సిన చోట, వాడాల్సిన పద్ధతిలో వాడితే ప్రయోజనం పొందుతాం. “తర్కం అన్నది అన్ని వైపులా పదునున్న కత్తి. మనం ఎందుకు వాడుతున్నాం అనే ప్రశ్న మీద
తర్కం యొక్క లక్ష్యం చేధించబడుతుంది”
అని చెబుతూ సిరివెన్నెల తన ఒక పాత
కవితలో ఇలా రాశారు -
తర్కం ఒక ఆట
ఒక కెలిడియోస్కోప్
మేధోమథనమే దాని లక్ష్యమైతే
తర్కం ఒక బాట
ఒక దూరదర్శిని
సత్యాన్వేషణే దాని లక్ష్యమైతే
తర్కాన్ని ఆటగా వాడడం అంటే మనకి నచ్చిన
దానికి సమర్థనగా లాజిక్కులు
తియ్యడం –
“అలలు లేని కడలి లేదు, అలాగే అలజడి లేని
మనసు లేదు. కలలు లేని కనులు లేవు.” అంటూ intermediate చదివే కురాడు తన ప్రేమని సమర్థించుకోవడం ఈ కోవకే చెందుతుంది. అందుకే వెలుగుని చూపే, గమ్యన్ని చేర్చే
బాటగా తర్కాన్ని వాడాలి అని సుతిమెత్తగా సూచిస్తున్నారు.
Define your success
వలపేదో వల వేసింది వయసేమో అటు
తోస్తుంది.
గెలుపంటే ఏదో ఇంత వరకు వివరించే
ఋజువేముంది??
సుడిలో పడు ప్రతి నావ… చెబుతున్నది
వినలేవా..?
Clarity అన్నది జీవితంలో చాలా ముఖ్యం. మనం ఏమి సాధించాలో తెలియకపోతే ప్రతి అల్పమైనదీ గెలుపులాగే అనిపిస్తుంది. వయసులో ఉన్న యువ
జంటకి ప్రేమే గొప్ప గెలుపు అనిపిస్తుంది అది సుడిలో పడదోసే నావ అయినా సరే.
అందుకే ఇక్కడ సిరివెన్నెల – “తెలివిని వాడండి. మీ జీవిత లక్ష్యాలపై దృష్టి పెట్టండి. తెలిసీ తప్పటడుగులు వెయ్యకండి”
అని చెప్తున్నారు.
Lost moment is lost forever
పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా?
ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా?
మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా..
కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా??
కాలం మనపై ప్రేమ కురిపిస్తూ, రోజూ గోరు ముద్దలుగా ఒకొక్క జీవిత సత్యాన్నీ తినిపిస్తూ కూర్చోదు.
మనకే ఆ జాగ్రత్తా, స్పృహా, తెలివీ ఉండాలి. సినిమాలో హీరో తన తండ్రిని కోల్పోతాడు. కొంత పశ్చాత్తాపం కలుగుతుంది. సూర్యుడు ఉన్నప్పుడు అతని
విలువని గ్రహించక రాత్రి అయ్యి చీకటి పడ్డాక తెలుసుకుంటే పెద్ద ప్రయోజనం లేదు.
అయితే మళ్ళీ వెలుగు వస్తుంది కాబట్టి ఈ సారైనా తెలివి తెచ్చుకుని మసలడం
చెయ్యాలి.
Learn from history
కడ తేరని పయనాలెన్ని..! పడదోసిన
ప్రణయాలెన్ని..!
అని తిరగేశాయా చరిత పుటలు వెనుజూడక
ఉరికే వెతలు.
తమ ముందు తరాలకు స్మృతుల చితులు
అందించాలా ప్రేమికులు???
ఇది కాదే విధి రాత..! అనుకోదేం ఎదురీత…!!
గత చరిత్రనీ, మన అనుభవాలని ఒక సారి తరచి చూసుకోవడం అవసరం. ఎందుకంటే అవి మనం చేసిన తప్పుల్ని, మన అసమర్థతల్ని, మన సత్తాలనీ చూపెడతాయి కనుక. మనం ముందు వెయ్యబోయే అడుగులు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో కొంత వివరిస్తాయి కనుక. మనం చరిత్రని తిరగ రాయాలనుకున్నా కూడా ఇప్పటికే రాసి ఉన్న చరిత్రని చదవడం అవసరం! ఇది విస్మరించి ప్రపంచంలో మాదే ప్రత్యేకమైన ప్రేమ జంటా, మాది అమర ప్రేమ, లేక అద్భుత ప్రేమ అనే బ్రాంతిలో మునుగుతూ ఉంటే చివరికి మునకే మిగులుతుంది. ఒక్క సారి ప్రేమ పేరుతో పడదోసిన పాత కథలనీ, ప్రేమ వల్ల రగిలిన చితులని స్మరించుకుంటే ఇలా ముందు వెనకలు చూడకుండా ఉరికే వలపు పరుగులు కుదుట పడతాయ్. అప్పుడు ప్రేమికుల జీవితాలూ, తల్లిదండ్రుల
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి