తెలుగు పద్యాలు
పద్యం
అప్పిచ్చువాడు, వైద్యుడు,
నెప్పుడు నెడతెగక బాఱు నేఱును, ద్విజుడున్
జొప్పడిన యూర నుండుము,
చొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ.
భావం :-
అవసరమునకు అప్పు ఇచ్చు మిత్రుడు,రోగము వచ్చినపుడు చికిత్స చేయుటకు వైద్యుడుని,ఎప్పుడును నీరెండక ప్రవహించు నదియు,శుభాశుభ కర్మలు చేయించు బ్రాహ్మణుడును ఉన్న ఊరిలో ఉండుము.ఈ సౌకర్యము లేని ఊరిలో ఉండకుము.
పద్యం :-
తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ !
భావం :-
తల్లిదండ్రుల మీద ప్రేమానురాగాలు లేని కుమారుడు పుట్టినా, మరణించినా ఒక్కటే . మట్టితో తయారైన పుట్టలోనూ చెదలు పుడతాయి , గిడతాయి . తల్లిదండ్రుల మీద దయలేని కొడుకు అటువంటి చెదపురుగులతో…
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి