జీవితం
జీవితం గురించి నాకు
జీవితం అంటే రెండు ఏడుపుల మధ్య నున్న విరామ సమయం
జీవితం అంటే రెండు ఏడుపుల మధ్య
నున్న విరామ సమయం. మనిషి పుట్టినప్పుడు తానేడ్చి, పోయినప్పుడు ఇతరులను
ఏడిపిస్తాడు. మరి మనందరి జీవితం రెండు ఏడుపుల మధ్య నుండే సమయమే కదా! పిల్లలు తాము కోరుకున్నది సాధించుకోవాలంటే
ఏడుపును మించిన
ఆయుధం లేదని మాటలు
రాకముందే గ్రహించేస్తారు.
జననం, మరణం మధ్య కాలమే జీవితం. కానీ... మనం ఎందుకు
బతుకుతున్నాం? మన జీవిత ఉద్దేశ్యం ఏమిటీ? అని ఆలోచించినపుడు... కొన్నిసార్లు
ఆశ్చర్యమేస్తుంది. మరికొన్నిసార్లు మనకు ఎవరైతే ఇష్టమో వారిలా
ఉండాలనుకుంటాం. మన దృష్టిలో వారిదే ఉన్నతస్థానం. ఎపుడూ ఇలాంటి అనవసరపు
ఆలోచనలతోనే కాలం వెళ్లదీస్తుంటాం. అంతేకానీ జీవితపు విలువను
తెలుసుకోవడంలో మాత్రం విఫలమవుతున్నాం. 'జీవితంలో మొదటి, ఉత్తమ విజయం ఏమిటంటే మన విలువను మనం తెలుసుకోవటమే. 'అది తెలుసుకోకుండా మనం చేసే మిగిలిన పనులన్నీ
సిగ్గుమాలిన, పనికిమాలిన చర్యలు' - అంటారు ప్లాటో.
పాటకు పల్లవి ప్రాణం. తోటకు మల్లియ కిరణం. మరి అందమైన జీవితానికి...?! ఆచరణే ఆభరణం.. అత్యంత అమూల్యం. అసలు జీవితం అంటే
ఏమిటి? ఓ కవి చెప్పినట్లు
'వెలుతురూ చీకటేనా..?' అంతులేని పోరాటమా..? 'అయితే పోరాడి గెలువు...' ఒకవేళ 'బహుమానం' అని భావిస్తే 'స్వీకరించు...' 'రహస్యం' అనుకుంటే 'పరిశోధించు...' కాదు ఛాలెంజ్...అని తలపోస్తే ' ధైర్యంగా ఎదుర్కో...'ఎన్నిసార్లు ఓడినా 'గెలవడానికి మరో అవకాశం వుండనే వుంటుంది..' వెనకడుగు వేయకు..'ముందడుగు వేసి ఆగకు..' 'సంకల్పం వుంటే సప్త సముద్రాలూ దాటొచ్చు..'
'కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటిన మేధావి కూడా
కళ్లు
తడపకుండా జీవితాన్ని దాటలేడు
జీవితం చాల చిన్నది కాని అందులో ఎన్నెన్నో తియ్యని అనుభందాలు, అనుభవాలు, ఆప్యాతలు, ఇంతేనా ఇంకెన్నో భాదలు కూడ,
ఎన్ని జన్మల పున్యమొ మనం మనుషులుగా పుట్టడం. ఇ
జన్మకు
వచ్చినందుకు మనం కేవలం సుకపడటమె కాదు, ఎంతో కొంత సమాజానికి ఉపయోగ పడాలి.
జీవితం ఒక ఆట – ఆడి గెలువు
జీవితం ఒక ప్రయాణం – కొనసాగించు
జీవితం ఒక యుద్ధం – పోరాడి గెలువు
జీవితం ఒక బహుమానం – స్వీకరించు
జీవితం ఒక రహస్యం – పరిశోధించు
జీవితం ఒక నాటకం – నీ పాత్రను ప్రదర్శించు
జీవితం ఒక చాలెంజ్ – ధైర్యంగా ఎదుర్కో
”జీవితంలో ఎన్నిసార్లు ఓడిపోయినా గెలవడానికి మరో అవకాశం ఉంటుంది”
వెనకడుగు వేయకు – ముందడుగేసి ఆగకు

ఒక్కసారి
ఆలోచించండి
మీ మనసు ప్రశాంతంగా, ఏకాంతంగా ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి. అసలు మీరెవరు? మీకేం కావాలి? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించు కోండి. మీ మెదడులో ఇన్నాళ్లు నిక్షిప్తమైన ఆలోచనలను, ఊహాలను ఒక్కొక్కటిగా బయటపెట్టండి. ఎందుకంటే మీ జీవితానికి మూలాధారం మీ ఆలోచనలే. ఇపుడు మీ జీవితావసరాలు, మీరు సాధించాలనుకున్న లక్ష్యాలు అన్నీ కూడా మీ కళ్ల ముందట కదలాడుతుంటాయి. మీ ఆలో చనలన్నింటికీ క్రమక్రమంగా కార్యరూపం ఇవ్వండి. మీ ఆలోచనలను ఆచరణలో పెట్టినట్లయితే... మీ జీవితమే మారుపోతుంది. కొన్నిసార్లు అద్భుతాలూ జరుగుతాయి. ఈ ప్రపంచమే మారిపోవచ్చు కూడా. మీ మెదడులో పాజిటివ్, నెగిటివ్ ఆలోచనలు రెండూ ఉంటాయి. మీ ఆలో చనలు ఎపుడూ కూడా సృజ నాత్మకంగా ఉండాలి. వినా శనం సృష్టించేలా ఉండ కూడదు. ఇలాంటి ఆలోచన లకు కళ్లెం వేయాలంటే మీ మెదడుపై మీ నియంత్రణ చాలా అవసరం.
మన జీవిత ఉద్దశమేమిటీ ?
ఈ విశ్వంలోని ప్రతి ఒక్కరికీ వారి జీవితపు ఉద్దేశ్యమేమిటో తెలిసి ఉండటం చాలా అవసరం. మనందరం కూడా మన శక్తి మేరకు మాత్రమే ఏదైనా సాధించేందుకు ప్రయత్నిస్తాం. ఆ మేరకే మన జీవి తాన్ని సంతృప్తిపరుచుకుంటాం. ఆ మేరకే సంతో షంగా ఉంటాం. కానీ.. కొంచెం కష్టపడితే... అను కున్న దానికంటే ఎక్కువ సాధిస్తాం. మహనీయులు ఎపుడూ కూడా వారి జీవితాన్ని సమాజ పునరుద్ధరణకే ధారపోస్తారు. వారి పుట్టుక కారణం, లక్ష్యం కూడా అదే ఉంటుంది. మన కూడా చాలా మందికి లక్ష్యాలు ఉం టాయి. కొందరు సరాదాలు, ఆనందాలనే ఇష్టపడ తారు. మరికొందరికి సాహిత్యమంటే ఇష్టం ఉం టుంది. చాలా కొద్ది మాత్రం సమాజానికి సేవ చేయా లని ఉంటుంది. ఎవరు ఎలా కావాలకున్నా..అది వారి చదువు, పెరిగిన వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. ప్రతివ్యక్తి జీవితలక్ష్యం వారి ఇష్టం, అభిరుచికనుగుణంగానే ఉంటుంది. జీవితంపై ఏ నిర్ణయం తీసుకున్నా... దాన్ని సాధించేందుకు తనలో ఉన్న పూర్తి శక్తిసామర్థ్యాలను వినియోగించాల్సిందే.
సంతోషమే... సగం బలం
ప్రతి ఒక్కరూ సమాజంలో ఉన్నతస్థానంలో ఉండాలనే కోరుకుంటాం. మనకు మనం సంతోషంగా ఉన్నపుడే... ఆ ఆనందాన్ని ఇతరులకూ పంచగలుగుతాం. మనచుట్టూ ఉన్న పరిసరాలు, పరిస్థితులపై మన సంతోషం ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో చుట్టూ ప్రశాంత వాతావరణం కావాలనుకుంటే కాస్త కష్టమే. ఈ ప్రపంచానికి అనుగుణంగా మనమే మారాలి. మనలో ఉన్న ఈర్ష్య, ద్వేషం, అసూయలను వదిలేయాలి. ఇతరులపై పెత్తనం చెలాయించుకోవాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. సమాజంలో ఉన్న ప్రతివ్యక్తికి గౌరవమివ్వాలి. వ్యక్తి గౌరవం కూడా వారి ఆలోచనలు, కోరికలు, ప్రవర్తననుబట్టి ఉంటుంది. అంతేకాదు... ఆ వ్యక్తి చుట్టూ ఉన్న వ్యక్తులను బట్టి కూడా వారి గురించి చెప్పవచ్చు. జీవితంలో సంతోషంగా ఉండాలంటే కోట్లకు పడగలెత్తాల్సిన అవసరం లేదు. రోజుకు కనీసం రెండుపూటల భోజనం చేసే వ్యక్తి కూడా సంతోషంగానే ఉండవచ్చు.
జీవితం... సార్థకత
కొన్ని వందల సంవత్సరాల క్రితం.... ఓ వ్యక్తి ఉదయం నిద్రలేచి పేపర్ చదువుతున్నాడు. ఆ పేపర్ చూడగానే ఆయనకు మొదట భయమేసింది. తరువాత ఆశ్చర్యమేసింది. ఎందుకంటే పేపర్‌లో ఆయన చూసింది, చదివింది... ఆయన 'మరణ వార్త'. పత్రికా యాజమాన్యం చేసిన పొరపాటువల్ల... మరొకరికి బదులుగా ఆయన ఫొటో వేశారు. ఆ కథనాన్ని చూడగానే ఆయన ఒక్క క్షణం షాక్‌కు గురయ్యాడు. తరువాత ఆలోచనలోపడ్డాడు.ఇన్నాళ్లు తాను సాధించింది ఇదేనా? అని బాధపడ్డాడు. ఇలాంటి గుర్తింపు తనకవసరం లేదనుకున్నాడు. ఆ రోజు నుంచి ప్రపంచంలో శాంతి స్థాపన కోసం కృషి చేశాడు. ప్రపంచశాంతికి ప్రతిరూపంగా మారాడు. ఆయన పేరు మీద శాంతి పురస్కారాన్ని కూడా ఇస్తున్నారు. ఇంతకూ ఆయన పేరేంటో తెలుసా? 'ఆల్ఫ్రెడ్ నోబెల్'
మన జీవితానికి తప్పకుండా ఓ లక్ష్యం ఉండాలి. జీవితం... తల్లితండ్రులు ఇచ్చిన వరం. అర్థంలేకుండా జీవిస్తే దానికి సార్థకత ఉండదు. లక్ష్యం లేకుండా జీవిస్తే... జీవితంలో శూన్యమే మిగులుతుంది. డబ్బు, జ్ఞానం ఉండగానే సరిపోదు. అది నలుగురికీ ఉపయోగపడాలి. అపుడే జీవితానికి సార్థకత చేకూరుతుంది. ఓ సారి... ఓ బాలుడు ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడు. నీటి ప్రవాహానికి కొట్టుకు పోతున్నాడు. బాలుడు ప్రాణభయంతో గట్టిగా రక్షించండి..! రక్షించండి..! అంటూ కేకలు పెడుతున్నాడు. ఇంత లో ఆ దారి గుండా వెళ్లే ఓ మధ్యవయస్కుడు బాలుడిని చూశాడు. వెంటనే ఆ నదిలోకి దూకి ఆ బాలుడిని రక్షించాడు. అనంత రం ఆ బాలుడు తనను కాపాడిన వ్యక్తికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆయన కృతజ్ఞతలు దేనికి? అంటూ ఎదురుప్రశ్న వేశాడు. అపుడు ఆ బాలుడు ... మీరు నా జీవితాన్ని కాపాడారు కదా! అన్నాడు అమా యకంగా. వెంటనే ఆ మధ్యవయస్కుడు.. 'బాబూ! నీవు బాగా చదువుకుని... పెద్ద య్యాక నలుగురికీ సహాయం చేయు. అపుడే నీ జీవితానికి సార్థకత ఉంటుంది. నా సహాయానికి అర్థం ఉంటుంది' అన్నాడు.
అవును... ప్రతి ఒక్కరికీ జీవితంలో ఉన్నత లక్ష్యాలు సాధించడం సాధ్యమే. కానీ... గొప్ప లక్ష్యాలు సాధిం చాలంటే మీ ఆలోచనలపై మీకు నియంత్రణ తప్పని సరిగా ఉండాలి. ఈ ప్రపంచంలో ఇతరులెవరూ మీ ఆలోచనలను నియంత్రించలేరు. మీరు మాత్రమే మీ ఆలోచనలను నియంత్రించుకోగలరు. అన్ని సంతో షాలు, విజయాల రహస్యం కేవలం పాజిటివ్ ఆలోచనలే. మీలో అపారమైన శక్తియుక్తులు దాగి ఉన్నాయి. ప్రపంచంలో మీరు సాధించలేనిది ఏదీ లేదు. మీరు విజేతలుగా అవతరించాలంటే మీ శక్తిసామర్థ్యాలన్నింటినీ వెలికితీయాలి. ఇందుకోసం శ్రమపడాలి. కన్నీళ్లు కార్చాలి. శ్వేదం చిందించాలి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి