పోస్ట్‌లు

జనవరి, 2015లోని పోస్ట్‌లను చూపుతోంది

జీవితం

జీవితం గురించి నాకు జీవితం అంటే రెండు ఏడుపుల మధ్య నున్న విరామ సమయం జీవితం అంటే రెండు ఏడుపుల మధ్య నున్న విరామ సమయం. మనిషి పుట్టినప్పుడు తానేడ్చి , పోయినప్పుడు ఇతరులను ఏడిపిస్తాడు. మరి మనందరి జీవితం రెండు ఏడుపుల మధ్య నుండే సమయమే కదా! పిల్లలు తాము కోరుకున్నది సాధించుకోవాలంటే ఏడుపును మించిన ఆయుధం లేదని మాటలు రాకముందే గ్రహించేస్తారు.   జననం , మరణం మధ్య కాలమే జీవితం. కానీ... మనం ఎందుకు బతుకుతున్నాం ? మన జీవిత ఉద్దేశ్యం ఏమిటీ ? అని ఆలోచించినపుడు... కొన్నిసార్లు ఆశ్చర్యమేస్తుంది. మరికొన్నిసార్లు మనకు ఎవరైతే ఇష్టమో వారిలా ఉండాలనుకుంటాం. మన దృష్టిలో వారిదే ఉన్నతస్థానం. ఎపుడూ ఇలాంటి అనవసరపు ఆలోచనలతోనే కాలం వెళ్లదీస్తుంటాం. అంతేకానీ జీవితపు విలువను తెలుసుకోవడంలో మాత్రం విఫలమవుతున్నాం. ' జీవితంలో మొదటి , ఉత్తమ విజయం ఏమిటంటే మన విలువను మనం తెలుసుకోవటమే. ' అది తెలుసుకోకుండా మనం చేసే మిగిలిన పనులన్నీ సిగ్గుమాలిన , పనికిమాలిన చర్యలు ' - అంటారు ప్లాటో.            పాటకు పల్లవి ప్రాణం. తోటకు మల్లియ కిరణం. మరి అందమైన ...