భారతదేశ భారీ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి చమురు ఇంధనంగా ఉపయోగపడుతుంది

**************************************************************

 

దేశంలో తొలిసారిగా కొన్ని నగరాల్లో పెట్రోల్ ధర లీటరు రూ.100కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరతో పోలిస్తే భారత్‌లో పెట్రోలు ధరలు చాలా ఎక్కువ.

మరి చమురు ధరల నుంచి సామాన్యులకు ఉపశమనం ఎప్పుడు లభిస్తుంది? పెట్రోలు, డీజిల్‌లపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడమే దీనిక మార్గమా ?ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య పెట్రోలు ధరల విషయంలో విమర్శలు, ప్రతి విమర్శలు తీవ్రంగా సాగుతున్నాయి. అయితే ఎవరి వాదన ఎలా ఉన్నా సామాన్యులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఇటు రైతులు కూడా సంతోషంగా లేరు. పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించాల్సిందేనని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.

 

ధరలు తగ్గించలేరా?

ఎక్సైజ్‌ సుంకం తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోందన్న మాట వినిపిస్తోంది. అయితే ఆర్థిక, చమురు మంత్రిత్వ శాఖల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని, అందువల్ల టాక్స్ తగ్గింపు నిర్ణయం తుది దశకు రాలేదని తెలుస్తోంది.

అయితే ఎక్సైజ్ సుంకం తగ్గించినా, అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ‌ధరలు నిరంతరం పెరుగుతుండటంతో వినియోగదారులకు పెద్ద ఊరట ఏమీ ఉండదని ప్రభుత్వం భావిస్తోంది.

రాబోయే కొన్ని వారాలు, నెలల్లో పెట్రోల్‌, డీజిల్ ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయని, రేట్లు మరింత పెరుగుతాయని నిపుణులు అంటున్నారు.

ప్రస్తుతం ముడి చమురు బ్యారెల్ ధర అంతర్జాతీయ మార్కెట్‌లో 66 నుంచి 67 డాలర్లు ఉంది. మరి అది ఈ సంవత్సరం 100 డాలర్లకు చేరుకుంటుందా ? అన్న ప్రశ్నకు అవుననే సమాధానం చెబుతున్నారు నిపుణులు.

 కేంద్రం చేతులెత్తేస్తే రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెరుగుతుంది. కానీ చమురు మీద వచ్చే ఆదాయంలో కేంద్రానిదే పెద్ద వాటా. ఆయిల్ మీద వచ్చే ప్రతి వంద రూపాయల పన్నులో రూ.37 కేంద్రానికి, రూ.23 రాష్ట్రాలకు చేరతాయి.

లాక్‌డౌన్‌ సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర బ్యారల్‌ 20 డాలర్లకు పడిపోయినప్పుడు పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గుతాయని ప్రజలు ఊహించారు. కానీ పెరుగుతూనే ఉన్నాయి. ఇలా ఎందుకు జరుగుతోంది? ‘‘భారత ప్రభుత్వం చమురుపై పన్నును పెంచింది. అందుకే ధరలు తగ్గలేదు’’ దేశంలో పెట్రోల్‌ బంకుల్లో అమ్మే పెట్రోలు, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్ ధరలతో ముడిపడి ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర తగ్గినా, పెరిగినా హెచ్చు తగ్గులు కనిపించాలి. కానీ గత ఆరేళ్లలో భారతదేశంలో అది జరగలేదు.

‘‘2014లో NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అంతర్జాతీయంగా ముడి చమురు ధర బ్యారెల్‌ 106 డాలర్లు ఉంది. అప్పటి నుంచి ధరలు తగ్గుతూ వచ్చాయి. నేను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చమురు ధరలు తగ్గుతుండటం నా అదృష్టంఅని అప్పట్లో ప్రధాని అన్నారు.

ఏడేళ్ల కిందట పెట్రోలు ధర రూ.72 ఉంది. కానీ ప్రభుత్వం చమురు ధరలు తగ్గించకుండా ఎక్సైజ్ ‌సుంకాన్ని పెంచింది’’

  •  

సామాన్యులకు ఊరట కలిగేదెలా ?

భవిష్యత్తులో ధరలు పెరగడమే తప్ప తగ్గడం ఉండదని నిపుణులు చెబుతున్నారు. దాని నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని చిట్కాలు. కానీ అవన్నీ జరుగుతాయా అన్నది ఇక్కడ పెద్ద సమస్య.

మొదటిది సూచన.. ధరలు తగ్గాలంటే మొదట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చమురుపై విధించిన ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలి. కానీ రెండు ప్రభుత్వాలు అందుకు సిద్ధంగా లేవు.

రెండోది NDA ప్రభుత్వ ఆర్థిక విధానాలకు విరుద్ధమైన సబ్సిడీని ఇవ్వడం. ఇందుకు కేంద్రం సిద్దంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ‘‘ రాయతీలు ఇవ్వడం తిరోగమనం. అలా రాయితీలు ఇవ్వడంవల్ల ధనికులు కూడా లాభపడతారు.అలాంటప్పుడు ‘‘టూ వీలర్లు నడిపే వారికి, పేదలకు మాత్రమే పెట్రోలు, గ్యాస్‌లలో రాయితీలు ఇవ్వాలి.

ప్రజలకు ఉపశమనం కలిగించడానికి మూడవ ఆప్షన్ పెట్రోలును జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం. అయితే ఇదొక రాజకీయ సమస్య అని, రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు అంగీకరించవని, మద్యం, చమురులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాబోమన్న హామీతోనే రాష్ట్రాలు జీఎస్టీ బిల్లును అంగీకరించాయీ

 

మరో మార్గం

ఇరాన్, వెనిజువెలా నుంచి ముడి చమురును కొనడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, కానీ అమెరికా ఆంక్షల కారణంగా దిగుమతులు సందిగ్థంలో పడ్డాయని.

ఇక భారతదేశం తన వ్యూహాత్మక చమురు నిల్వలను పెంచాలని కొందరు నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. దేశంలోకి దిగుమతి ఆగిపోతే ఇక్కడున్న చమురు నిల్వలు 10 రోజులకు మాత్రమే సరిపోతాయి. ప్రైవేట్ సంస్థల వద్ద పెద్ద మొత్తంలో చమురు నిల్వలు ఉన్నాయి.

నిల్వలను 10 నుంచి 90 రోజులకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. అత్యవసర సమయాల్లో, అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదొడుకులు, యుద్ధాల వల్ల ఏదైనా ఇబ్బంది తలెత్తితే ఈ వ్యూహాత్మక చమురు నిల్వలను ఉపయోగిస్తారు.

అమెరికా వద్ద ప్రపంచంలో అత్యధిక మొత్తంలో నిల్వలున్నాయని, అమెరికా, చైనాల తర్వాత అత్యధికంగా చమురును దిగుమతి చేసుకునే దేశం భారతదేశమే కాబట్టి రిజర్వ్‌లను పెంచుకోవాలని నిపుణులు అంటున్నారు.

దిగుమతిపై ఆధారపడటం తగ్గించాలి

భారతదేశంలో పెట్రోలియం, గ్యాస్ నిక్షేపాల పరిమాణం తక్కువ. అందువల్ల దిగుమతి చేసుకోక తప్పదు.

చమురు మీద ఆధారపడకుండా ఉండాలంటే భారతదేశం 10-15 సంవత్సరాల ముందుకు వెళ్లి ప్రణాళికలు రచించాల.

‘‘చమురు వాడకం తగ్గించి ఎలక్ట్రికల్, హైడ్రోజన్, నేచురల్ గ్యాస్‌వైపు దృష్టిపెట్టాలి. ఇప్పటికే ఆ దిశగా నడుస్తున్నాం. కానీ 2030-35నాటి వరకు ఇది సాధ్యం కాదు’’. ప్రస్తుతం ఉన్న పరిస్థితులనుబట్టి చూస్తే భవిష్యత్తులో ఎప్పటికో ఉపశమనం లభించవచ్చేమోగానీ, రాబోయే కొద్ది నెలల్లో మాత్రం చమురు భారం కొనసాగక తప్పదు

భారతదేశ భారీ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి చమురు ఇంధనంగా ఉపయోగపడుతుంది. చమురు ధరలు పెరుగుతూ ఉంటే, ద్రవ్యోల్బణం, జీడీపీ, కరెంట్ అకౌంట్‌పై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఇది డిమాండ్‌పై ప్రభావం చూపి ఆర్థికాభివృద్ధిని ప్రభావితం చేస్తుంది 

 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

భారతదేశము నా మాతృభూమి...." ప్రతిజ్ఞ "

శ్రీమద్భగవద్గీత

జీవితం