దక్షిణ_తెలంగాణ దాహం తీరదా
#దక్షిణతెలంగాణకుగండి..
********
గద్దలు పీక్కుతింటునట్టు ....ఉంది ...
ముఖ్యమంత్రి పట్టించుకోడు ...
మంత్రులకు తెలియదు ...
వెరసి దక్షిణ తెలంగాణ ఎండబోతుంది ...
మరో ప్రత్యేక దక్షిణ తెలంగాణా ఉద్యమం ప్రజలనుండే రాబోతుంది .....
******
##ఎలానో_చదవండీ :
*******
👉🏽ఆల్మట్టితో తెలుగు రాష్ట్రాల నోటమట్టి కొట్టేందుకు కర్ణాటక మళ్ళీ ఎత్తులు వేస్తోంది.
👉🏽కృష్ణమ్మ పరుగులు కన్నడ నేలకే పరిమిత మయ్యే కుట్రలకు తెరతీసింది.
👉🏽ప్రస్తుతం సుప్రీంకోర్టులో వివాదం ఉన్నా.. కర్నాటక ఆల్మట్టి ఎత్తు పెంపు విషయంలో దూకుడుగా ముందుకెళ్తోంది.
👉🏽అదే జరిగితే శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల ఆయకట్టు ప్రమాదంలో పడుతుంది. నాగార్జునసాగర్‌కైతే కృష్ణమ్మవరదను పూర్తిగా మరిచిపోవాల్సిన ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతాయి.
👉🏽519.6 మీటర్ల ఎత్తులో ఉన్న ఆల్మట్టిని 524.26 మీటర్ల ఎత్తుకు పెంచాలని డిసైడైన కర్ణాటక 20గ్రామాల ముంపునకు గురికా బోతున్నాయని పేర్కొంటూ పునరావాస చర్యలకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసింది.
👉🏽రూ.61 వేల కోట్లతో చేపడుతున్న ఎత్తుపెంపు ప్రాజెక్టుకు అనుమతి నిస్తూ నోటిఫికేషన్ జారీచేయాలని కేంద్రాన్ని కోరింది.
👉🏽👉🏽 ఆల్మట్టి ప్రాజెక్టు సామర్థ్యం 129.72 టీఎంసీలు. ఐదు మీటర్లు పెంచడం ద్వారా మరో 130 టీఎంసీలు అదనంగా వాడుకునే సౌకర్యం లభిస్తుందని,
👉🏽👉🏽ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు శాపంగా మారుతుందని నీటిపారుదల శాఖ వర్గాలు మండిపడుతున్నాయి.
👉🏽👉🏽కృష్ణాజ లాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలు 811, కర్ణాటక 700, మహారాష్ట్రకు 560 టీఎంసీల కేటాయింపులున్నాయి. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ గతంలో కేటా యింపులు పెంచుతూ.. ఆల్మట్టి ఎత్తుపెంపునకు అనుమతినిస్తూ ప్రతిపాదించగా, దీనిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి 2010లోనే సుప్రీంకోర్టులో సవాల్ చేసి స్టే తీసుకొచ్చింది. అప్పటి నుండి గత పదేళ్ళుగా స్టే అమలులో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే 2014 జులైలో తెలంగాణ ప్రభుత్వం కూడా రిట్‌పిటీషన్ వేసింది.
##అక్కడా మేమే.. ఇక్కడా మేమేనంటూ..
👉🏽👉🏽కర్ణాటక ప్రభుత్వం కేంద్రంలో మేమే.. ఇక్కడా మేమే అంటూ ఆల్మట్టి ఎత్తు ప్రతిపాదనను మళ్ళీ తెరపైకి తెచ్చింది.
👉🏽👉🏽తెలుగు రాష్ట్రాలతో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఆల్మట్టి ఎత్తుపెంచితే కృష్ణా బేసిన్‌లోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారనుంది.
👉🏽👉🏽మిగులుజలాల ముచ్చటే భవిష్యత్‌లో ఉండదు. 👉🏽👉🏽మిగులుజలాలపై ఆధారపడి నిర్మించిన నెట్టెంపాడు, భీమా, డిండి వంటి ప్రాజెక్టులకు కష్టాలు తప్పవు.
👉🏽👉🏽నిర్మాణంలో ఉన్న పాలమూరు- రంగారెడ్డికి మిగిలేది కడగండ్లే.
👉🏽👉🏽ప్రస్తుతం రెండు పంటలకు పుష్కలంగా నీందిస్తున్న నాగార్జునసాగర్ చుక్కనీరు అందించని పరిస్థితి నెలకొంటుంది.
👉🏽👉🏽సాగునీరే కాదు.. తాగునీటికి కూడా ఇబ్బందులు ఏర్పడే స్థితి వస్తుందన్న ఆందోళనను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
👉🏽👉🏽ఒక్క తెలంగా ణకే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జునసాగర్ ఆయకట్టు కూడా ప్రమాదంలో పడుతుంది.
##వచ్చేనీరు కూడా…
👉🏽👉🏽ప్రస్తుతం ఏటా కృష్ణానది వరద.. అక్కడి ప్రాజెక్టులు నిండిన తర్వాత, ఆగస్టు నెలాఖరులో లేదా సెప్టెంబర్ మొదటివారం లో తెలుగు రాష్ట్రాలను తాకుతోంది.
👉🏽👉🏽నాలుగైదేళ్ళకోసారి మాత్రమే శ్రీశైలం, నాగార్జున సాగర్‌లకు నిండే స్థాయిలో నీరు వస్తున్నయి.
👉🏽👉🏽ఆల్మట్టి ఎత్తుపెంచితే ఇక మీదట ఆగస్టు నెలాఖరులో వచ్చే నీరు అక్టోబర్- నవంబర్‌లో వస్తుందని, అప్పుడు వచ్చే అడపాదడపా నీరు సాగుకు ఎందుకూ కొరగాదని విశ్లేషిస్తున్నారు.
👉🏽👉🏽ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వివాదం నడుస్తుండగా, ఇప్పుడు కర్ణాటక దూకుడు తెలంగాణను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి