‘పుస్తకం హస్తభూషణం’
పుస్తకపఠనం... విజ్ఞాన
సోపానం
ఏప్రిల్ 23 ‘ప్రపంచ పుస్తక మరియు కాపీరైట్స్’ దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘పుస్తకం’ విలువను చాటిచెప్పే చిన్న ప్రయత్నం...
ఆస్తులు కరిగిపోవచ్చు, ధనం దొంగలపాలు కావచ్చు, అనుబంధాలు చెరిగిపోవచ్చు... కానీ, విజ్ఞానం అలా కాదు... ఒక్కసారి విజ్ఞానాన్ని
అందిపుచ్చుకుంటే... తనువు అంతమయ్యేవరకు అది జీవితాన్ని ముందుకు నడిపిస్తూనే
ఉంటుంది. అంతేకాదు... చోరులకు దొరకనిది, అగ్నికి
అంటనిది, నీట మునికి కనుమరుగు
కానిది విజ్ఞానం ఒక్కటే... అంతటి మహోన్నత విజ్ఞానాన్ని పళ్లెంలో పెట్టి అందించేదే ‘పుస్తకం’... పుస్తకం హస్తభూషణం అంటారు పెద్దలు...
సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయిన నేటి సమాజంలో పుస్తకాన్ని ఎంతమంది చదువుతున్నారు? అరచేతిలో అమరిపోయే సెల్‌ఫోన్‌లో కూడా అక్షరాలు చక్కర్లు కొడుతుంటే... ఇక పుస్తకాల మాటేమిటి? పుస్తకం విలువను భవిష్యత్తు తరాలకు అందించే భాద్యత మనకు లేదా? పిల్లల్లో పుస్తక పఠానాసక్తి నానాటికీ తరిగిపోతోంది. ఎంతసేపూ కంప్యూటర్లతో కుస్తీ పట్టే పిల్లలు, యువతీయువకులు పుస్తకాన్ని మరిచిపోతున్నారు... విజ్ఞానఖనిని ర్యాక్‌లకే పరిమితం చేస్తున్నారు...
సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయిన నేటి సమాజంలో పుస్తకాన్ని ఎంతమంది చదువుతున్నారు? అరచేతిలో అమరిపోయే సెల్‌ఫోన్‌లో కూడా అక్షరాలు చక్కర్లు కొడుతుంటే... ఇక పుస్తకాల మాటేమిటి? పుస్తకం విలువను భవిష్యత్తు తరాలకు అందించే భాద్యత మనకు లేదా? పిల్లల్లో పుస్తక పఠానాసక్తి నానాటికీ తరిగిపోతోంది. ఎంతసేపూ కంప్యూటర్లతో కుస్తీ పట్టే పిల్లలు, యువతీయువకులు పుస్తకాన్ని మరిచిపోతున్నారు... విజ్ఞానఖనిని ర్యాక్‌లకే పరిమితం చేస్తున్నారు...
‘పుస్తకం హస్తభూషణం’ అనేవారు ఒకప్పుడు. అదీ నిజమే, ఎందుకంటే పుస్తక పఠనం మానసికోల్లాన్ని కల్గిస్తుంది. విజ్ఞానాన్ని పెంచుతుంది. మనిషిని మనీషిగా మారుస్తుంది. అచ్చుయంత్రాలు లేనప్పుడు మనకు తాళపత్ర గ్రంథాలే శరణ్యంగా ఉండే ది. ఆ గ్రంథాలు ఎవరి దగ్గర ఉంటే వారి దగ్గ రికి వెళ్ళి చదవాల్సి వచ్చేది. శిష్యులు గురు వుల వద్ద అశువుగా చదువును నేర్చుకునే వారు. కానీ రానూరానూ కాలం మారిపోయి శాస్తప్రరంగా అభివృద్ధి చెంది, ముద్రణా యం త్రాలు వచ్చాయి. దాంతో పూర్వకాలంలో ఉన్న విజ్ఞానమంతా పుస్తక రూపంలో వెలువ డటం ప్రారంభమయ్యాయి.
పుస్తకాలు విజ్ఞానాన్ని పంచి పెట్టే సాధనాలు, పఠనాసక్తి గలవాడు చదువురాని రాజుకన్నా గొప్పవాడు. అందుకే పూర్వకాలంలో ప్రతి ఇంటా పుస్త పుస్తకాలు (బాలశిక్ష, నీతి చంద్రి క) ఉండేది. పుస్తకాలు లేని గది ఆత్మలేని శరీరం వంటిది అని నమ్మేవారు. ఏ విధంగా రసాయనిక ఎరువులు వాడటం ద్వారా భూ సారం కోల్పోతుందో అలాగే నేటి కాలంలో టీ.వీ., కంప్యూటర్ల సంస్కృతి వల్ల పుస్తక పఠనాసక్తి తగ్గిపోతుంది. ఎలక్ట్రానిక్ మీడియా విస్తరణ, క్షణం తీరుబడిలేని యాం త్రికమైన ఆధునిక జీవిత విధానాల కారణం గా పుస్తక పఠనాసక్తి, అభిరుచి క్షీణిస్తుండడం ఆందోళనకరమైన పరిణామం. పుస్తకాలంటే కేవలం సిలబస్‌లకో, పోటీ పరీక్షలకో, వృత్తి నైపుణ్యాలకో, శాస్తస్రాంకేతిక విజ్ఞానాలకో పరి మితమైనవి కావు.
అమూల్యమైన సాంస్కృతి క-నైతిక విలువలకు, తాత్విక భావ స్రవంతికి కూడా అద్దం పడతాయి. మానవ ప్రవృత్తిని భావోద్వేగాలను సజీవంగా అవి అనుభవం లోకి తెస్తాయి. సెల్‌ఫోన్లు, క్యాలిక్యులేటర్స్, కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు, వచ్చాక ‘పుస్తకం’ హస్తభూషణం’ హోదాను కోల్పోయిందంటా రు కొందరు. కానీ ఆ విషయం నిజం కాదు. బుల్లితెర భూతం, అంతర్జాలం (ఇంటర్‌నెట్) వచ్చి పుస్తక పఠనం మీద తెరవేసి ఉండవ చ్చు. కానీ అదీ తాత్కాలిక ప్రభావం. మాత్ర మే. ప్రస్తుత కాలంలో ‘పుస్తకాలంటేనే ఎలర్జీ’ టీవీ, అంటే ప్రాణంలో ప్రాణం అయింది. కానీ ‘పుస్తకం’ ఒక నిశ్శబ్ద విప్లవం లాంటిది.
‘‘అక్షరాలకూ, భావాలకూ, సమాజ రథ చక్రా
లకూ చరిత్ర ఆవిర్భావానికి పుస్తకమే వజ్రా
యుధం’’ పుస్తకం సమస్త ప్రపంచపు దర్పణం
గా పేర్కొనవచ్చు. పుస్తకం లేనిదే మానవ మ నుగడ సాధ్యంకాదు. మనిషికి రక్త ప్రసరణ ఎలాంటిదే భావ ప్రకటనకు పుస్తకం అటువం టిది. హృదయాన్ని విశాలం చేసేది పుస్తకమే. చదివే కొద్దీ పెరిగేది విజ్ఞానం, అందుకే. పుస్తక ప్రపంచ దినోత్సవం సందర్భంగా మనం మంచి పుస్తకాలను ఎంపిక చేసుకొందాం, చదువుదాం. ఇతరులను చదివిద్దాం.
నేటి ఆదునిక జీవితంలో పుస్తకం అత్యవసర మార్గదర్శకంగా పని చేస్తుంది. తీరిక సమ యాల్లో వెన్నంటి ఉండే ప్రియమైన నేస్తం పుస్తకం మాత్రమే. అనుభవాలు, అనుభూ తులు పంచేది పుస్తకమే. మన జీవనశైలిని మార్చే వస్తువు పుస్తకమే. పుస్తక పఠనం వల్ల లభించే ఆనందం శాశ్వతం అని చెప్పవచ్చు. ఎల్లప్పుడూ మనకు అందుబాటులో ఉండే సలహాదారు పుస్తకమే. అందుకే పుస్తక ప్రపంచ దినోత్సవం సంద ర్భంగా మనం కూడా పుస్తకాలను పఠిద్దాం. కనీసం రోజు ఒక గంటైనా కేటాయిద్దాం. జ్ఞా నాన్ని ఆస్వాదిద్దాం. కొత్త పుస్తకాల సేకరణకై, రచనలకై మనం మనవంతు కృషి చేద్దాం. భా వితరాలను కూడా ‘పుస్తక ప్రపంచం’ ప్రాము ఖ్యత గురించి తెలియచేద్దాం మన ప్రాచీన విజ్ఞానాన్ని మనం తెల్సుకొని, పుస్తకాల రూ పంలో నిక్షిప్తం చేసి, ప్రజలందరికీ విజ్ఞాన్ని, జ్ఞానాన్ని పంచడానికి అందరూ కృషి చేద్దాం.
విజ్ఞాన దీపికలెన్నెన్నో...
గత చరిత్రను సజీవంగా మనముందుంచే జ్ఞాపికలుగా... విజ్ఞానాన్ని అందించే దీపికలు గా పుస్తకాలు మనకు మేలు చేస్తున్నాయి... ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా అలాంటి మధురమైన కొన్ని పుస్తకాలను మననం చేసుకోవాల్సి ఉంది... మహాభార తం, రామాయణం, భాగవతం లాంటి గ్రం ధాలు గత చరిత్రను నేటి సమాజానికి తెలి యజేయడంతోపాటు జీవితంలో ఎదురుకునే సమస్యలు... వాటికి పరిష్కారమార్గాలను తెలియజేస్తున్నాయి... శాస్తవ్రేత్తలు వారు చేసే ప్రయోగాలను పుస్తక రూపంలో ఉంచడంతో అవి చదవడం ద్వారా విజ్ఞానం పెంపొందు తుంది.. ప్రపంచంలోని గొప్ప రచయితలు పలు అంశాలపై రాసిన పుస్తకాలు మానవ జీవితంలో మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి.
ప్రముఖ రష్యన్ రచయిత మ్యాగ్సిన్ గోర్కి రాసిన ‘అమ్మ’ పుస్తకం మాతృత్వపు గొప్పత నాన్ని ప్రపంచానికి తెలియజేసింది... మరో ప్రముఖ రచయిత లియోటాల్‌స్టాయ్ రచిం చిన ‘వార్ అండ్ పీస్’ అనే పుస్తకం యుద్దా లు, ప్రపంచ శాంతిని తెలియజేశాయి... రవీంద్రనాథ్ ఠాగూర్ ‘గీతాంజలి’ ద్వారా ప్రేమ సందేశాన్ని, గొప్పతనాన్ని తెలియజే శారు... వీటితోపాటు విశ్వనాథ సత్యనారా యణ, శరత్‌చంద్ర, శ్రీశ్రీ, ప్రేమ్‌దాస్ లాంటి గొప్ప రచయితలు అనేక గొప్ప పుస్తకాల ద్వా రా సమాజానికి గొప్ప సూచనలందించారు. విద్యార్ధులు చదివే పుస్తకాలు విజ్ఞానాన్ని పెంపొందిస్తుండగా, రచయితలు రాసిన గొప్ప పుస్తకాల ద్వారా చరిత్ర తెలుస్తోంది... గ్రంధా లయాల్లో లభిస్తున్న ప్రాచీన పుస్తకాల ద్వారా గత చరిత్ర అనుభవాలు నేటి సమాజానికి తెలుస్తున్నాయి. ప్రపంచంలో కెల్లా అతి పెద్ద లైబ్రరీ రష్యాలో ఉంది..
పుస్తకాలను సేకరించే వారిని బిబ్లియో గ్రఫీ అని పుస్తకాలు ఎక్కువ గా చదివేవారిని బిబ్లియో మ్యానియో అని పిలుస్తుంటారు. గొప్ప పుస్తకాలను సేకరించి పలు విద్యాసంస్థలు తమ లైబ్రరీల్లో పొందు పరుస్తున్నారు.
ప్రపంచ పుస్తక దినోత్సవ విశేషాలు...
ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవం గా పరిగణించడానికి విభిన్న కథనాలున్నాయి.
1. సెవాంతెస్, షేక్సిపియర్, ఇన్కా గర్సి లాసో, వేగా అను రచయితలు 1616 ఇదే రోజున మరణించారు. 2. అంతేకాదు జోసెఫ్ ప్లా, వ్లాదిమర్, మారిస్ ద్రువాం ఇలా ఇంకా చాలా మంది ప్రపంచ ప్రఖ్యాత రచయితలు ఇదే రోజున మరణించడమో, జ న్మించడమో జరగడం విశేషం. 3. ఇదే రోజున సెయింట్ జార్జ్ జన్మది నాన్ని స్పెయిన్‌లో జరుపుకుంటారు. ఇప్పటికీ స్పెయిన్‌లో ప్రతి పుస్తక కొనుగోలు పై ఒక గులాబీని గిఫ్ట్‌గా ఇస్తారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ రోజును1995 లో యునెస్కో ‘ప్రపంచ పుస్తక దినం’ గా ప్రకటించిం డమేకాదు, ప్రపంచ పుస్తక మరియు కాపీ హక్కుల దినంగా జరపాలని, రచయితలను, ప్రచురణకర్తలను, పాఠకులను, ఉపాధ్యాయులను ఈ రోజున గౌరవించాలని సూచించింది. అంతర్జాలం, మీడియా కొంత వరకూ పుస్తకం మనుగడను అడ్డు కుంటున్నాయి.
అందుకే.. పుస్తకా న్ని కొందాం. పుస్తకాన్ని బ్రతికించు కొందాం. యూకే లోనూ ఐర్లాండు లోనూ ‘ప్రపంచ పుస్తక దినం’ ఒక ఘనమైన వేడుకగా జరుపుకుంటారు. ఆన్‌లైన్లో రచయితలు తమ రచనలను చదివి వినిపిస్తారు. పాఠ శాలలలో పుస్తక పఠనా పోటీలు నిర్వహిస్తారు. వీటినే రీడథాన్ అనడం విశేషం. అమెరికాలోనైతే వేల కొలది ఇ-బుక్‌లను నెట్‌లో పెట్టి వాటిలో కొన్ని పుస్తకాల మీద బడి పి ల్లలకు ఏక్సలరేటెడ్ రీడింగ్ అనే కాంపిటీషన్ పెడతారు. అయితే కొన్ని దేశాలలో ఈ వేడుకను వేర్వేరు రోజుల్లో జరుపుకోవడం విశేషం. ఇది ఇంకా భారతదేశంలో అంత ప్రాచుర్యంలోకి రాలేదనే చెప్పాలి.
పుస్తకం భవితకు బాట...
చరిత్రంటే గతానికి వర్తమానానికి మధ్య సాగే నిరంతర సంభాషణ. ఆ నిరంతర సంభాషణకే కాదు, అందులోనే బీజప్రాయంగా నిక్షిప్తమై ఉన్న భవిష్యత్తుకు కూడా అద్దం పట్టేది పుస్తకం. పుస్తకమంటే అక్షరం, నాశ నం కానిది. అక్షరబద్ధమైన వేల సంవత్సరాల మానవ అనుభవం, ఆచరణ, జ్ఞానం, భాషాసంస్కృతులు శాశ్వతమై నిలుస్తాయి, తరతరాలకు అందుతాయి, మానవ వికాసానికి సోపానాలవుతాయి. ఏడాదికి ఓసారై నా మనం మన భూత, భవిష్యత్, వర్తమానాలకు అద్దంపట్టే పుస్తక పఠనం ఆవశ్యకతను గుర్తించడం, గుర్తింపజేయడం అవసరం. అందు కోసమే ఐక్యరాజ్య సమితి విద్య, యునెస్కో 1995 నుంచి ఏటా ఏప్రిల్ 23ను ప్రపంచ పుస్తక దినోత్సవంగా జరుపుకునే ఆనవాయితీకి నాంది పలికింది.
పిల్లల్లో పఠనాసక్తి పెంచండిలా...
* టీవీలు, ఇంటర్నెట్‌ల వల్ల పిల్లల్లో పుస్త కాలు చదివే అలవాటే లేకుండాపోతోంది. వారికి అసలు పుస్తకాలు చదవాలన్న ఆలో చనే రావటం లేదు. అయితే వారితో పుస్తకా లు చదివించటాన్ని నెమ్మది నెమ్మదిగా అలవాటు చేయించాలి.
* కథలు, కామిక్స్ పుస్తకాల్ని పెద్దవాళ్లే పెద్ద గా చదివి వినిపిస్తుంటే... రానురాను వారికి ఆసక్తి పెరుగుతుంది. సాధారణంగా పిల్లలకు విన్న విషయాన్నే మళ్ళీ మళ్లీ చెప్పించుకో వటం, నచ్చిన బొమ్మల్ని పదే పదే చూడటం అనే అలవాటు ఉంటుంది. అందుకోసం అమ్మో, నాన్నో చదివిన పుస్తకాన్ని వాళ్ళు మళ్లీ తెరిచే ప్రయత్నాలు సాగిస్తార
* వీలైనంతవరకు పిల్లలకు అనేక పుస్తకాలను అందుబాటులో ఉంచుతుంటే, వాటిని చూడాలన్న, చదవాలన్న కుతూహ లం వారికి కలుగుతుంది. మొదట్లో ఎక్కు వగా బొమ్మలుండే పుస్తకాలయితే వారికి ఎక్కువ ఆసక్తి ఉంటుంది. బొమ్మల్ని చూపించి, కొద్దిగా కథ చెప్పి వదిలేస్తే, ఆపైన వారే వాటిని చదవటం ప్రారంభిస్తారు.
* పిల్లలు నిద్రపోయేందుకు ముందు కథలు వినేందుకు ఇష్టపడతారు. అలా కథలు చదివి వినిపిస్తూ ఉంటే, కొన్నాళ్లకు వారికి అది అలవాటైపోతుంది. ఇలా ప్రతి రోజూ ఓ అరగంటపాటు వాళ్ళని పుస్తక పఠనంలో నిమగ్నం చేస్తుండాలి. ఇంట్లోని పెద్దలంతా అలా చదువుకునే అలవాటు ఉంటే పిల్లలకూ అది అలవడుతుంది.
* వారపత్రికలు, కథలు, బొమ్మల పుస్త కాల గురించి వీలైనంతవరకు పిల్లలతో చర్చించాలి. వాటి గురించి వివరించాలి. చదివే అలవాటును నెమ్మదిగా సాగించాలే గానీ... ఒక్కసారే అది సాధ్యపడదన్న విష యాన్ని తల్లిదండ్రులు గుర్తెరిగి ప్రవర్తించాలి.
ఒత్తిడి తగ్గించే దివ్యౌషధం... పుస్తక పఠనం
మానసిక ఒత్తిడి తగ్గేందుకు ఎలాంటివారైనా సరే సంగీతాన్ని ఇష్ట పడుతారన్న సంగతిని అందరూ ఆమోదించేదే. అయితే ఒత్తిడితో ఉద్రేకమైన నరాలు మాత్రం... ఏవేని పుస్త కాలు చదవటం ద్వారా వేగంగా ఉపశమనం పొందుతాయని ఇటీవల కొన్ని అధ్యయనా ల్లో వెల్లడైంది. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొం దేందుకు పుస్తక పఠనం అనేది చాలా మెరు గైన పరిష్కార మార్గమ ని... ఈ అధ్యయనం చెబుతోంది. ఆరు నిమిషాలపాటు చదవటం ద్వారా... మానసి క ఒత్తిడిలో మూడింట్లో రెండింతలు తగ్గిపో గలదని ఈ అధ్యయనం వెల్లడించినట్లు ‘ది డైలీ టెలిగ్రాఫ్’ పత్రికా కథనం నివేదించింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి