దక్షిణ_తెలంగాణ దాహం తీరదా
#దక్షిణతెలంగాణకుగండి.. ******** గద్దలు పీక్కుతింటునట్టు ....ఉంది ... ముఖ్యమంత్రి పట్టించుకోడు ... మంత్రులకు తెలియదు ... వెరసి దక్షిణ తెలంగాణ ఎండబోతుంది ... మరో ప్రత్యేక దక్షిణ తెలంగాణా ఉద్యమం ప్రజలనుండే రాబోతుంది ..... ****** ##ఎలానో_చదవండీ : ******* 👉🏽ఆల్మట్టితో తెలుగు రాష్ట్రాల నోటమట్టి కొట్టేందుకు కర్ణాటక మళ్ళీ ఎత్తులు వేస్తోంది. 👉🏽కృష్ణమ్మ పరుగులు కన్నడ నేలకే పరిమిత మయ్యే కుట్రలకు తెరతీసింది. 👉🏽ప్రస్తుతం సుప్రీంకోర్టులో వివాదం ఉన్నా.. కర్నాటక ఆల్మట్టి ఎత్తు పెంపు విషయంలో దూకుడుగా ముందుకెళ్తోంది. 👉🏽అదే జరిగితే శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల ఆయకట్టు ప్రమాదంలో పడుతుంది. నాగార్జునసాగర్‌కైతే కృష్ణమ్మవరదను పూర్తిగా మరిచిపోవాల్సిన ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతాయి. 👉🏽519.6 మీటర్ల ఎత్తులో ఉన్న ఆల్మట్టిని 524.26 మీటర్ల ఎత్తుకు పెంచాలని డిసైడైన కర్ణాటక 20గ్రామాల ముంపునకు గురికా బోతున్నాయని పేర్కొంటూ పునరావాస చర్యలకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసింది. 👉🏽రూ.61 వేల కోట్లతో చేపడుతున్న ఎత్తుపెంపు ప్రాజెక్టుకు అనుమతి నిస్తూ నోటిఫికేషన్ జారీచేయాలని కేంద్రాన్ని కోరింది. ?...