పోస్ట్‌లు

2020లోని పోస్ట్‌లను చూపుతోంది

దక్షిణ_తెలంగాణ దాహం తీరదా

#దక్షిణతెలంగాణకుగండి.. ******** గద్దలు పీక్కుతింటునట్టు ....ఉంది ... ముఖ్యమంత్రి పట్టించుకోడు ... మంత్రులకు తెలియదు ... వెరసి దక్షిణ తెలంగాణ ఎండబోతుంది ... మరో ప్రత్యేక దక్షిణ తెలంగాణా ఉద్యమం ప్రజలనుండే రాబోతుంది ..... ****** ##ఎలానో_చదవండీ : *******  👉🏽ఆల్మట్టితో తెలుగు రాష్ట్రాల నోటమట్టి కొట్టేందుకు కర్ణాటక మళ్ళీ ఎత్తులు వేస్తోంది. 👉🏽కృష్ణమ్మ పరుగులు కన్నడ నేలకే పరిమిత మయ్యే కుట్రలకు తెరతీసింది. 👉🏽ప్రస్తుతం సుప్రీంకోర్టులో వివాదం ఉన్నా.. కర్నాటక ఆల్మట్టి ఎత్తు పెంపు విషయంలో దూకుడుగా ముందుకెళ్తోంది. 👉🏽అదే జరిగితే శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల ఆయకట్టు ప్రమాదంలో పడుతుంది. నాగార్జునసాగర్‌కైతే కృష్ణమ్మవరదను పూర్తిగా మరిచిపోవాల్సిన ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతాయి. 👉🏽519.6 మీటర్ల ఎత్తులో ఉన్న ఆల్మట్టిని 524.26 మీటర్ల ఎత్తుకు పెంచాలని డిసైడైన కర్ణాటక 20గ్రామాల ముంపునకు గురికా బోతున్నాయని పేర్కొంటూ పునరావాస చర్యలకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసింది. 👉🏽రూ.61 వేల కోట్లతో చేపడుతున్న ఎత్తుపెంపు ప్రాజెక్టుకు అనుమతి నిస్తూ నోటిఫికేషన్‌ జారీచేయాలని కేంద్రాన్ని కోరింది. ?...

కరోనావైరస్: విద్యార్థుల చదువుల్ని సంక్షోభంలో పడేస్తోందా? ఆన్‌లైన్ తరగతుల ప్రభావం వారిపై ఎలా ఉంటోంది?

కరోనావైరస్: విద్యార్థుల చదువుల్ని సంక్షోభంలో పడేస్తోందా ? ఆన్‌లైన్ తరగతుల ప్రభావం వారిపై ఎలా ఉంటోంది ? సీబీఎస్ఈ చదువులు ప్రారంభమై నెల రోజులు దాటిపోయింది. దాదాపు అన్ని పాఠశాలలు జూమ్ , మైక్రోసాఫ్ట్ , గూగుల్ ఇలా ఏదో ఒక వీడియో కాలింగ్ ప్లాట్ ఫాం ద్వారా పిల్లలకు పాఠాలు చెప్పేందుకు శత విధాల ప్రయత్నిస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభం కాకపోయినా... తాజా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం మరో 2 నెలలు ఆలస్యం కావచ్చని ఆంధ్ర ప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియాతో చెప్పారు. పదో తరగతి విద్యార్థుల పరీక్షలు ఇంకా పూర్తి కాని నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. ఏపీలో సప్తగిరి ఛానెల్ ద్వారా రోజూ రెండు గంటలు , అలాగే రేడియో , రెయిన్ బో ఎఫ్ఎం ఛానెళ్ల ద్వారా పాఠాలను బోధిస్తూ విద్యార్థులను ఏదో విధంగా పరీక్షలకు సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తోంది విద్యా శాఖ. ఇక కార్పొరేట్ పాఠశాలల విషయానికొస్తే... దాదాపు నెల రోజులుగా అన్ని పాఠాశాలలు పిల్లలకు ఆన్ లైన్ ...

132 ఏళ్ళ ఘనమైన చరిత్ర కలిగిన ఒక చరిత్ర భూస్థాపితం!!!

132 ఏళ్ళ   ఘనమైన చరిత్ర కలిగిన   ఒక చరిత్ర భూస్థాపితం !!! హైదరాబాద్‌లో సచివాలయంను కూల్చేసి , అక్కడే కొత్త సచివాలయ భవనం కట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో సోమవారం అర్థరాత్రి నుంచి ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అత్యంత రహస్యంగా కూల్చివేత పనులు ప్రారంమయ్యాయి. కూల్చివేత పనులు జరుగుతున్న ప్రాంతం చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సచివాలయం దగ్గర ఎంత బందోబస్తు ఉందో , ఇప్పుడు దాదాపు అలాంటి భద్రతాచర్యలే చేపట్టారు. సచివాలయం చుట్టూ ఉన్న చిన్న చిన్న గల్లీలతోపాటూ అన్ని ప్రధాన దారులనూ మూసివేశారు. ఒక్కో రహదారి దగ్గరా బ్యారికేడ్లు పెట్టి పోలీసులు , అధికారులను మోహరించి ఎవరూ అటువైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. మీడియాను కూడా అనుమతించకుండా ప్రభుత్వం అత్యంత రహస్యంగా భవనాల కూల్చివేతలు కొనసాగిస్తోంది. కొన్ని బ్లాకులను ఇప్పటికే దాదాపు కూల్చివేయగా , అన్ని బ్లాకులూ పూర్తిగా నేలమట్టం అయ్యేవరకూ ఈ పనులు కొనసాగించనున్నారు. ఈ కూల్చివేతలు మంగళవారం అర్థరాత్రి , లేదా బుధవారం మధ్యాహ్నం వరకూ పూర్తవుతాయని భావిస్తున్నారు. మొత్తం భవనాలు నేలమట్టం చేశాక , మిగతా ...