పోస్ట్‌లు

2015లోని పోస్ట్‌లను చూపుతోంది

ప్రశ్నార్ధకమవుతున్న న్యాయవ్యవస్ధ

" కులము గల్గువాడు , గోత్రంబు గల్గువాడు , విద్యచేత విర్రవీగువాడు పసిడి గల్గువాని బానిసకొడుకులు"  అన్నాడు వేమన్న!యెప్పుడు ? కొన్ని శతాబ్దాల క్రితం - బహుశా సహస్రాబ్దాలు కూడా దాటిపోయి ఉండొచ్చు!కానీ కొన్ని నిజాలు యుగాల తరబడి మళ్ళీ మళ్ళీ రుజువులతో సహా జరుగుతూనే ఉంటాయి  నేటి న్యాయ వ్యవస్థలో ఒక తీర్పు వెలువడ్డానికి , ఒక నేరం నిర్ధారించడానికి , కొన్నేళ్ల కాలం పడుతోంది. ఇందకోసం వందలాది పేజీల చార్జిషీట్ , బోలెడు ఫైళ్లు , మరెన్నో సాక్ష్యాలు , ఇంకెన్నో రుజువులు..వీటన్నింటి ఆలంబనగా ఏళ్ల తరబడి వాదనలు..అవన్నీ ముగిసాక , కిందా మీదా పడి కింద కోర్టు తీర్పు చెబుతుంది. కానీ అంతలోనే పై కోర్టు , కింది కోర్టు తీర్పును పక్కన పెడుతుంది లేదా కొట్టి వేస్తుంది కోర్టు కోర్టుకు తీర్పుమారితే , కోర్టుల్లో న్యాయం వున్నట్లా లేనట్లా ? మన న్యాయవ్యవస్థపై గౌరవం, భయం, భక్తీ అలాంటివి. అయితే రాను రాను వివిధ కేసుల్లో కోర్టులు ఇస్తున్న తీర్పులు చూస్తుంటే, ఈ భయమూ, భక్తి, గౌరవం ప్రశ్నార్థకమవుతున్నాయి అంటున్నారు అనుభవజ్ఞులైన కాలమిస్టులు. 18 ఏళ్లపాటు దిగువ కోర్టులో నలిగిన కేసు తీర్పు,  ఎనిమిది ...

‘పుస్తకం హస్తభూషణం’

చిత్రం
పుస్తకపఠనం... విజ్ఞాన సోపానం ఏప్రిల్ ‌ 23 ‘ ప్రపంచ పుస్తక మరియు కాపీరైట్స్ ‌ ’ దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘ పుస్తకం ’ విలువను చాటిచెప్పే చిన్న ప్రయత్నం ... ఆస్తులు కరిగిపోవచ్చు , ధనం దొంగలపాలు కావచ్చు , అనుబంధాలు చెరిగిపోవచ్చు... కానీ , విజ్ఞానం అలా కాదు... ఒక్కసారి విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే... తనువు అంతమయ్యేవరకు అది జీవితాన్ని ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. అంతేకాదు... చోరులకు దొరకనిది , అగ్నికి అంటనిది , నీట మునికి కనుమరుగు కానిది విజ్ఞానం ఒక్కటే... అంతటి మహోన్నత విజ్ఞానాన్ని పళ్లెంలో పెట్టి అందించేదే ‘ పుస్తకం ’... పుస్తకం హస్తభూషణం అంటారు పెద్దలు... సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయిన నేటి సమాజంలో పుస్తకాన్ని ఎంతమంది చదువుతున్నారు ? అరచేతిలో అమరిపోయే సెల్‌ఫోన్‌లో కూడా అక్షరాలు చక్కర్లు కొడుతుంటే... ఇక పుస్తకాల మాటేమిటి ? పుస్తకం విలువను భవిష్యత్తు తరాలకు అందించే భాద్యత మనకు లేదా ? పిల్లల్లో పుస్తక పఠానాసక్తి నానాటికీ తరిగిపోతోంది. ఎంతసేపూ కంప్యూటర్లతో కుస్తీ పట్టే పిల్లలు , యువతీయువకులు పుస్తకాన్ని మరిచిపోతున్నారు... విజ్ఞానఖనిని ర్యాక్‌లకే పరిమితం చేస్తున్నా...