నూతన జాతీయ విద్యా విధానానికి కేంద్రం ఆమోదం దే శీయ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు కేంద్రం సిద్ధమైంది. అందరికీ విద్యను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు.. కొత్త విధానాన్నిఅమల్లోకి తీసుకు రానుంది. ఈ మేరకు నూతన జాతీయ విద్యా విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం.. నాలుగు దశల్లో కొత్త విధానం ఉండనుంది. 5+3+3+4 విధానంలో దీన్ని అమలులోకి తీసుకురానుంది. అలాగే 3 నుంచి 18 ఏళ్ల వయసున్న వారికి ఉచిత నిర్భంధ విద్యను అందించాలని నూతన విద్యా విధానంలో ముఖ్యమైన అంశంగా చేర్చింది. కొత్త విద్యా విధానంలో సిలబస్‌లో కూడా భారీ మార్పులు జరగనున్నాయి. వృత్తి విద్యతో పాటు , ఉపాధి లభించే విధంగా ఇది ఉండనుంది. ఇక నూతన విద్యా విధానంలో మొదటి ఐదేళ్లలో ఫౌండేషన్ కోర్సు , ఆ తరువాత మూడేళ్లను ప్రీ ప్రైమరీ స్కూల్ , ఆ తర్వాత చదువులను గ్రేడ్ 1, గ్రేడ్ 2 గా పరిగణించనున్నారని సమాచారం. ఇందు కోసం ప్రతి రాష్ట్రంలోనూ రాష్ట్రస్థాయి స్కూల్ రెగ్యులేటరీ అథారిటీని కేంద్రం ఏర్పాటు చేయనుంది. నిర్బంధ విద్య పొడగింపు ప్రస్తుతం 14 ఏళ్ల లోపు విద్యార్థులకు ...
పోస్ట్‌లు
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
ఆంధ్ర , తెలంగాణల మధ్య జల వివాదాలు ? పరిష్కారాలు ? తెలుగు రాష్ట్రాలు జల వివాదాల్లో. కృష్ణ , గోదావరి , వంశధార తదితర నదీ జలాల కోసం ఎప్పటికప్పుడే ఇటు ఆంధ్రప్రదేశ్ , అటు తెలంగాణ పదునైన వ్యాఖ్యలు చేస్తున్నాయి. రెండు రాష్ట్రాలకూ జీవనాధారమైన కృష్ణ , గోదావరి జలాల వివాదంపై కేంద్ర జల శక్తి మంత్రి నేతృత్వంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇటీవల చర్చించారు. ఈ నేపథ్యంలో అసలు వివాదాలు ఏమిటి ? ఇవి ఎలా పుట్టుకొచ్చాయి ? లాంటి ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు చూద్దాం. హైదరాబాద్ , మైసూర్ సంస్థానాల కాలం నుంచీ నలిగిపోతున్న కృష్ణ.. మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో ఈ నది జన్మిస్తుంది. తూర్పువైపుగా కర్ణాటక , తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా ప్రవహించి ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది. హైదరాబాద్ , మైసూర్ సంస్థానాల కాలం నుంచీ ఈ నదీ జలాలు వివాదాస్పదమే. ఆ తర్వాత ఏర్పడిన ప్రస్తుత నాలుగు రాష్ట్రాలూ నదీ జలాల కోసం ఎప్పటికప్పుడు వివాదాలకు దిగుతున్నాయి. ఈ వివాదాలను పరిష్కరించడమే లక్ష్యంగా అంతర్రాష్ట్రాల నదీ జలాల వివాదాల చట్టం- 1956 కింద 1969 లో కృష్ణ నదీ జలాల వివాద పరిష్కార ట్రైబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)...
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
భరతమాత బానిస శృంఖలాలు తెంచడానికి ఐసీఎస్ వదిలి ఆంగ్లేయులపైకి దూసుకొచ్చిన ఓ బులెట్ “ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ” . ‘ మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి.. నేను మీకు స్వేచ్ఛనిస్తాను.. ’ భారత స్వాతంత్య్ర పోరాటంలో మంత్రంలా వినిపించిన సమర నినాదం ఇది. ‘ చలో ఢిల్లీ ’, ‘ జైహింద్ ’ అంటూ ఆ మహానాయకుడు ఇచ్చిన నినాదాలు ఈనాటికీ సజీవంగా ఉన్నాయి. భరతమాత బానిస శృంఖలాలు తెంచడానికి విదేశీనేలపై తొలి స్వతంత్ర భారత సైన్యాన్ని , తొలి స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన యోధుడాయన. జననమే తప్ప మరణం లేని మహానేత. భారతదేశ ప్రజల హృదయాల్లో ‘ నేతాజీ ’ గా చిరస్థాయిగా నిలిచిన అమరుడు. అతికొద్ది సంవత్సరాల ప్రజాజీవితంలో ఎన్నటికీ మరచిపోలేనంతటి అభిమానాన్ని చూరగొన్న మహోన్నత నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ‘ స్వాతంత్య్రం అంటే అడిగి తీసుకునే భిక్ష కాదు. పోరాడి సాధించుకునే హక్కు.. ’ భారత స్వాతంత్రోద్యమంలో ఒక రకమైన స్తబ్ధత ఏర్పడిన సమయమది. రవి అస్తమించని సామ్రాజ్యం నిర్మించిన బ్రిటిష్‌వారితో గట్టిగా పోరాడితే ఫలితం లేదని , శాంతియుత మార్గంలో నిరసనలు తెలియజేస్తూ సంప్రదింపులు జరిపి...