పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై ఎందుకీ వ్యతిరేకత.. అందులో ఏముంది?
పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై ఎందుకీ వ్యతిరేకత.. అందులో ఏముంది ? కేంద్రం ప్రతిపాదించిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలు సహా విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాలు మంగళవారం బంద్ నిర్వహించాయి. ర్యాలీలు , ఆందోళనలు , భారీ ప్రదర్శనలు నిర్వహించగా , ఇలాంటి బిల్లును తీసుకురావడం తగదని దాదాపు వెయ్యి మంది మేధావులు , కళాకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రతిపాదించి తాజా బిల్లు ఆమోదం పొంది అమల్లోకి వస్తే నిర్దిష్ట నిబంధనలను పాటించిన కాందిశీకులకు భారతీయ పౌరసత్వం లభిస్తుంది. పౌరసత్వం కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదు , ఆయా దేశాల్లోని ప్రభుత్వాలతో వ్యక్తులకు ఉండే సన్నిహిత సంబంధానికి ప్రతీక. 1955 నాటి చట్టానికి ఐదోసారి సవరణ స్వాతంత్య్రానంతరం తొలిసారగా 1955 లో పౌరసత్వ చట్టాన్ని రూపొందిచగా , ఇంతవరకూ నాలుగుసార్లు కీలక సవరణలు చేశారు. తాజాగా ఐదోసారి చట్ట సవరణకు కేంద్ర ప్రభుత్వం బిల్లును రూపొందించింది. ఒక పక్క దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ అమలుచేస్తామని చెబుతూనే పౌరసత్వ సవరణ బిల్లును ప్రతిపాదించింది. పొరుగు దేశాల నుంచి వలస వచ్చిన ఆరు మతాల వారికి...