శ్రీమద్భగవద్గీత
శ్రీమద్భగవద్గీత నాల్గవ అధ్యాయం జ్ఞానయోగం శ్రీ భగవానువాచ: ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్ | వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే ௨ బ్రవీత్ || 1 శ్రీ భగవానుడు: వినాశనం లేని ఈ యోగం నేను పూర్వం సూర్యుడికి ఉపదేశించాను. సూర్యుడు మనువుకూ , మనువు ఇక్ష్వాకుడికీ బోధించారు. ఏవం పరంపరాప్రాప్తమిమం రాజర్షయో విదుః | స కాలేనేహ మహతా యోగో నష్టః పరంతప || 2 అర్జునా! ఇలా సంప్రదాయ పరంపరగా వచ్చిన కర్మయోగాన్ని రాజర్షులు తెలుసుకున్నారు. అయితే అది ఈ లోకంలో క్రమేపి కాలగర్భంలో కలసిపోయింది. స ఏవాయం మయా తే ௨ ద్య యోగః ప్రోక్తః పురాతనః | భక్తో ௨ సి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్ || 3 నాకు భక్తుడవూ , స్నేహితుడవూ కావడంవల్ల పురాతనమైన ఈ యోగాన్ని నీకిప్పుడు మళ్ళీ వివరించాను. ఇది ఉత్తమం , రహస్యమూ అయిన జ్ఞానం సుమా! అర్జున ఉవాచ: అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః | కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి || 4 అర్జునుడు: సూర్యుడి జన్మ చూస్తే ఏనాటిదో , మరి నీవు ఇప్పటివాడవు. అలాంటప్పుడు నీవు సూర్యుడికి ఎలా ఉపదేశించావో ఊహించలేకపోతున్నాను. శ్రీ భగవానువాచ: బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున...